అందంగా ఉందని స్నేహితురాలి మొహం చెక్కేసి చంపిన ఇద్దరమ్మాయిలు

two girls carved friend face and killed

రష్యాలోని అర్ఖంగెల్స్క్‌లో నివసిస్తున్న విక్టోరియా అవెరినా (17) అలియాస్ వికాకు 16 ఏళ్ల లీనా, ఇరినా అనే స్నేహితులు ఉన్నారు. ఆమె ఎప్పుడు వారితోనే కలిసి తిరుగుతుండేది. వారి మధ్య ఏమైందో ఏమో, ఓ రోజు లీనా, ఇరినాలు వికాను పాడుబడిన భవనానికి పిలిచారు. అనంతరం గాజు సీసాలను వీకా ముఖంపై కొట్టారు. పగిలిన గాజు పెంకులతో వికా ముఖాన్ని గుర్తుపట్టని విధంగా చెక్కేశారు. అనంతరం గొంతు నులిమి చంపి ఇంటికి వెళ్లిపోయారు. వికా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జాగిలాలతో శోధించగా పాడుబడిన బంగళా సమీపంలోని పచ్చిక బయళ్లలో ఆమె శవం లభ్యమైంది. విచారణలో భాగంగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు ఆమె లీనా, ఇరీనాలతో మాట్లాడినట్లు ఫోన్ కాల్స్ ఆధారంగా తెలుసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరిని అనుమానస్పద నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో లీనా, ఇరీనా చేసిన నేరాన్ని అంగీకరించారు. విచారణలో లీనా, ఇరీనా విస్తుగొలిపే విషయాలు చెప్పారు. ఆమె తమకంటే ఎక్కువ అందంగా, ఆకర్షనీయంగా ఉంటుందని, ఆమె తన అందం చూసుకుని తమని ఎప్పుడూ హేళన చేసేదన్నారు. ఆ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నామని తెలిపారు. అయితే, పోలీసులు దీని వెనుక వేరే కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్యకు మరో వ్యక్తి సహకరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.