గన్ మెన్ హఠాన్మరణం.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్!

mla shankar naik gunman died

రాజకీయ నేతలు అన్నాక భావోద్వేగాలకు అతీతంగా ఉంటారని భావిస్తాం. కానీ తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్(ఎస్టీ) ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం ఇందుకు భిన్నం. చాలాకాలంగా తన దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ తో శంకర్ నాయక్ కు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ హఠాన్మరణంతో ఆయన తీవ్రమైన షాక్ కు గురయ్యారు. శ్రీనివాస్ భౌతికకాయాన్ని చూడగానే భోరున విలపించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడెను సైతం మోశారు.  అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. గన్ మెన్ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే తన కుడిభుజంగా భావించేవారని స్థానికులు తెలిపారు.  శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి శంకర్ నాయక్ విలపించిన తీరు స్థానికులను కూడా కంటతడి పెట్టేలా చేసింది. శ్రీనివాస్ అంత్యక్రియలకు గ్రామస్తులంతా తరలివచ్చారు. శ్రీనివాస్ గత ఐదేళ్లుగా శంకర్ నాయక్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో మడిపెల్లి గ్రామనికి చెందిన శ్రీనివాస్ ఎ ఆర్ కానిస్టేబుల్ అయితే ఆయన శంకర్ నాయక్ వద్ద పీఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు.