శైలజారెడ్డి అల్లుడుకి మళయాళ మాస్టర్ వాయింపు.

Gopi Sunder is doing music for Naga Chaitanya film
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని హీరో నాగచైతన్యతో సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి చేస్తున్న శైలజారెడ్డి అల్లుడు త్వరలో షూటింగ్ మొదలు పెట్టుకుంటోంది. టైటిల్ చూస్తే అత్తాఅల్లుళ్ళ ఫార్ములా సినిమా అనిపించినా కధలో మాత్రం కొత్తగా పెళ్లి అయిన జంట మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్ మీద ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ అనుకున్నప్పుడు నాగ్ చేసిన అల్లరి అల్లుడు ఫ్లేవర్ సినిమాలో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే నేటి తరం కనెక్ట్ అయ్యే పాయింట్ చుట్టూనే కధ,కధనం ఉండేలా దర్శకుడు మారుతి ప్లాన్ చేస్తున్నారంట.

ఇక నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేసారట. ఈ సినిమాకి సంబంధించి ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు మారుతి. ప్రముఖ మలయాళ మ్యూజిక్ దర్శకుడు గోపి సుందర్ చేత నాగ చైతన్య సినిమాకి సంగీతం చేయిస్తున్నారు. మారుతి తో గోపి సుందర్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు హిట్ కావడమే కాకుండా ఆ సినిమాల్లో సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి కూడా ఆ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కొనసాగించడానికి మారుతి డిసైడ్ అయ్యాడు. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్ కూడా మలయాళీ అమ్మాయే కావడం విశేషం.