లంక అద్యక్షుడు గొటబాయ రాజపక్స

లంక అద్యక్షుడు గొటబాయ రాజపక్స

శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగగా 1.59కోట్ల మంది ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అధికార పార్టీ అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస, నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ ఎన్‌పీపీ పార్టీ అభ్యర్థి అనుర కుమారా దిస్సనాయకేలు శ్రీలంక పీపుల్స్‌ ఫ్రంట్‌ పార్టీ తరఫున మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ గొటబాయా రాజపక్స అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.

35 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో శ్రీలంక అధ్యక్ష పదవికి పోటీ పెరిగి ఆసక్తిగా మారింది. దేశ ప్రధానిని తొలగించి మహింద రాజపక్సను ప్రధానిగా గతేడాది దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో మూడు నెలల పాటు దేశంలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. లంకలోని చర్చ్‌లు లక్ష్యంగా జరిగిన బాంబుదాడుల్లో ఇద్దరు ఆస్ట్రేలియన్లు సహా 250మంది మరణించారు. ఈ ఘోరాన్ని దేశాధ్యక్షుడు ఆపలేక పోయినందుకు సిరిసేనను పార్లమెంట్‌ నివేదిగా నిందితుడిగా ప్రకటించారు.

ప్రతిపక్ష పార్టీ శ్రీలంక పోడుజన పెరమున పార్టీ తరఫున మహింద రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స పోటీ చేస్తున్నారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స పాలకపక్ష యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ రాజపక్స గెలిచే అవకాశాలే కొంచెం ఎక్కువ ఉన్నాయని అంచనా.

అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స తన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘేపై దాదాపు 13 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గొటబాయ రాజపక్స లంకకు ఏడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఈయన పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రాచీన నగరం అనురాధపురంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.