రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ

Growing popularity for government schools day by day

ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందిస్తుండటంతో పలువురు ప్ర ముఖులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్ప టికే పలువురు ఉన్నతస్థాయి అధికారులు ప్రభు త్వ బడులవైపు మొగ్గు చూపగా గురువారం పలువురు తమ పిల్లలను చేర్పించారు. సిరిసిల్ల తొమ్మిదో అదనపు న్యాయమూర్తి అంగడి జయరాజ్ తన ఇద్దరు కుమార్తెలు జనహిత, సంఘహితను గురువారం సిరిసిల్లలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చేర్పించారు. జనహితను పదోతరగతిలో, సంఘహితను ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ఆయన ఇటీవల మంథని నుంచి బదిలీపై సిరిసిల్లకు వచ్చారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి జయరాజ్ మా ట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల కు కార్పొరేట్‌స్థాయి నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. ఇటీవల వెలువడిన టెన్త్‌ఫలితాల్లో సర్కారు బడులు ఉత్తమ ఫలితాలను సాధించాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం పాఠశాల ఇంచార్జి హెచ్‌ఎం రాధారాణి మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో న్యాయమూర్తి జయరాజ్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయమన్నారు.