జగన్ కలను నమ్ముతున్న కొడాలి నాని.

gudiwada-mla-kodali-nani-dreaming-more-about-ys-jagan-in-becoming-cm

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సీఎం కుర్చీలో కూర్చోవాలని తండ్రి వై.ఎస్ చనిపోయినప్పటినుంచి జగన్ కంటున్న కల. ఈ కల సాకారం అయినట్టే అని 2014 ఎన్నికల ముందు జగన్, వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ పండితులు కూడా నమ్మారు. కానీ జరిగింది వేరు. జనం ఇచ్చిన తీర్పు వేరు. 2014 ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ ప్రభుత్వం పడిపోతుంది, వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ ఇంకో కల కన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో ఆ కల నుంచి ఉలిక్కిపడి నిద్ర లేచారు. ఇక నంద్యాల, కాకినాడ ఉపఎన్నికల ఫలితాలతో కల సంగతి దేవుడు ఎరుగు నిద్ర మత్తు కూడా వదిలిపోయింది.

ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర లో తమ పార్టీ శ్రేణులే తరలించుకు వచ్చిన జనాలను చూసి జగన్ 2019 లో అధికారం ఖాయం అనే కల కంటున్నారు. పైగా అధికార టీడీపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పేస్తున్నారు. ఆయన మాటలను అధికార పక్షం లైట్ గా తీసుకుంటోంది. జనం చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా ఆ మాటలు నమ్మలేకపోతున్నాయి.

జగన్ మాటలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం గట్టిగా నమ్ముతున్నారు. జగన్ అధికారం కోసం కలలు కంటుంటే ఈయన ఇంకో అడుగు ముందుకు వేశారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చినా తాను మంత్రి పదవి తీసుకోబోనని శెలవిచ్చారు. పైగా జగన్ గుండెల్లో ఇంత స్థానం ఉంటే చాలు అన్నారు. నిజానికి టీడీపీ లో వున్నప్పుడు కూడా ఆ పార్టీ , చంద్రబాబు గురించి ఇలాగే చెప్పారు. జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా తాను మంత్రి పదవి తీసుకోనని కొడాలి నాని చెప్పడం జనాలకు నవ్వు తెప్పిస్తోంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న నానుడును గుర్తు చేస్తోంది.