ఈసారి 100 కోట్లకు పైగానే..!

Gunasekhar to Make Hiranyakashyap movie with 100 Cr Budget
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భారీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్‌ మూడు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన గుణశేఖర్‌ నష్టాలు లేకుండా సేఫ్‌ బిజినెస్‌తో బయట పడ్డాడు. ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డ గుణశేఖర్‌ మరోసారి అదే తరహా ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను తీయాలని గుణశేఖర్‌ భావిస్తున్నాడు. గత కొంత కాలంగా గుణశేఖర్‌ ‘హిరణ్యకశిప’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపూగా పూర్తి అయ్యింది. రానా ప్రధాన పాత్రలో ఆ చిత్రంను తెరకెక్కించేందుకు గుణశేఖర్‌ ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు.

వైవిధ్యభరిత పాత్రలకు ప్రాణం పోసేందుకు ఎప్పుడు ముందుండే రానా తాజాగా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఒక ప్రముఖ నిర్మాతతో కలిసి గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో 100 కోట్ల సినిమా అంటే అది చాలా పెద్ద సాహసం. ఆయన మార్కెట్‌ ఆ స్థాయిలో లేదు. సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా 100 కోట్లు రాబట్టడం అంటే కాస్త కష్టమైన విషయమే. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప గుణశేఖర్‌ బడ్జెట్‌ రికవరీ కాదు. మరి ఆ అద్బుతం జరిగేనా, రానా వంద కోట్లను రాబట్టేనా అంటూ సినీ విశ్లేషకులు అప్పుడే అంచనాలు వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లేదా చివర్లో ‘హిరణ్యకశిప’ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.