“గుంటూరు కారం” ట్రైలర్ వాయిదా పడ్డట్టేనా?

“గుంటూరు కారం” ట్రైలర్ వాయిదా పడ్డట్టేనా?
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీర్ 28వ మూవీ ని దర్శకుడు త్రివిక్రమ్ తో ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ లో తమది హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఈ మూవీ పై నెలకొన్నాయి. ఇక వీరి నుంచి వస్తున్నా ఈ మూవీ గుంటూరు కారం అనే ఒక ఊహించని మాస్ సబ్జెక్టు కావడంతో అంచనాలు చాలా ఎక్కువే ఉన్నాయి.

అయితే ఈ సినిమా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనే అంశాలు చాలా వరకు డీటెయిల్స్ ఆడియెన్స్ కి తెలియదు. దీనితో ట్రైలర్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ట్రైలర్ కి ఒకే డేట్ ను ఫిక్స్ చేశారు.

“గుంటూరు కారం” ట్రైలర్  వాయిదా పడ్డట్టేనా?
Guntur Karam

ఈ జనవరి 6నే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ట్రైలర్ పై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ట్రైలర్ ఉన్నట్టా లేనట్టా అనేది సస్పెన్స్ గా మారింది. మరి మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది