ఆస్ట్రేలియా టీంకు గౌహ‌తి యువ‌త క్ష‌మాప‌ణ‌

Guwahati youth apologisefor Australian cricket team

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చేసిన త‌ప్పుకు ప‌శ్చాత్తాప‌ప‌డుతోంది గౌహ‌తి య‌వ‌త‌. భార‌త్ ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన రెండో టీ 20లో మ‌న‌దేశం ఓడిపోయింద‌న్న ఆగ్ర‌హంతో గౌహ‌తిలో కొంద‌రు యువ‌కులు ఆసిస్ జ‌ట్టు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న త‌రువాత అసోం అభిమానుల వైఖ‌రిపై భార‌త్ తో పాటు ప్ర‌పంచంలోని అనేక దేశాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో గౌహ‌తి యువ‌త దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది.

ఆస్ట్రేలియా టీంకు గౌహ‌తి యువ‌త క్ష‌మాప‌ణ‌ - Telugu Bullet

ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు త‌మ‌ను క్షమించాల‌ని విజ్ఞ‌ప్తిచేస్తోంది. క్రీడాకారులు బ‌స‌చేసిన రాడిన్ బ్లూ హోట‌ల్ ముందు వంద‌లాది మంది యువ‌తీ యువ‌కులు క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. తాము చేసిన ప‌నికి సిగ్గుప‌డుతున్నామని, ఓ తుంట‌రి చేసిన ప‌నికి రాష్ట్ర యువ‌తంతా క్ష‌మించాల‌ని వేడుకుంటోందని వారు తెలిపారు. గౌహ‌తి యువ‌త తాజా వైఖ‌రిపై నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం ద్వారా వారు ఎంతో హుందాగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.