క్యాన్సర్‌తో బాధపడుతున్న హంసా నందిని

క్యాన్సర్‌తో బాధపడుతున్న హంసా నందిని

తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి, హీరోయిన్ హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేశారు. వంశ పారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ కాన్సర్ ఉందని హంసా నందిని ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. రొమ్ములో గడ్డ ఉన్నట్లుగా అనిపించడంతో ఇటీవల హంసా నందిని చెకప్ చేయించుకుంటే, పరీక్షలు చేసిన డాక్టర్స్ ఆమెకు బ్రెస్ట్ క్యాన్స‌ర్ ఉంద‌ని, అది కూడా మూడో ద‌శ‌లో ఉంద‌ని తెలియ‌జేశారు. ఆపరేషన్‌ ద్వారా గడ్డను తొలగించిన వైద్యులు హెరిడిటరీ బ్రెస్ట్ కేన్సర్‌ పాజిటివ్‌ అని రిపోర్ట్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం ఆమె డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. చిరున‌వ్వుతో కాన్స‌ర్‌ను జయిస్తాన‌ని ఆమె తెలిపారు. ఇప్పుడు ఆమె కీమో థెర‌పీ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 సైకిల్స్ కీమోథెరపీ పూర్తయ్యాయి. మరో 7 సైకిల్స్ బ్యాలన్స్ ఉన్నాయి. 18 ఏళ్ల క్రితం హంసా తల్లి కేన్సర్‌తో మృతి చెందారు. ఇంకా బెటర్‌గా, స్ట్రాంగ్‌గా స్క్రీన్‌ మీదకు వస్తానని ..అందరికీ తన గురించి చెప్పి ఎడ్యుకేట్‌ చేస్తానని హంసా నందిని పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు 40 శాతం మాత్రమే ఉన్నాయని, బయట పడాలంటే ఆపరేషన్స్ చేయించుకోవడం ఒకటే దారి అని ఆమె తెలిపారు.

2004లో ఒక‌ట‌వుదాం సినిమాతో హంసా నందిని హీరోయిన్‌గా రంగ ప్ర‌వేశం చేశారు. హీరోయిన్‌గా కాకుండా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. లెజెండ్‌, అత్తారింటికి దారేది, ఈగ ఇలా ప‌లు చిత్రాల్లో న‌టిగా మెప్పించారు. కొన్ని సినిమాల్లో ప్ర‌త్యేక గీతాల్లోనూ ఆమె న‌ర్తించారు. 2018లో ఆమె గోపీచంద్ హీరోగా చేసిన పంతం సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.