వెబ్ సిరీస్‌లో స్టార్‌ ల హంగామా

వెబ్ సిరీస్‌లో స్టార్‌ ల హంగామా

వెబ్ సిరీస్‌ల హ‌వా పెరుగుతోంది. టాప్ స్టార్లు కూడా వీటిపై దృష్టి సారిస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు ఈ రంగంలోకి దిగుతున్నాయి. అందుకే  వెబ్ సిరీస్‌లో స్టార్‌ల హంగామా క‌నిపిస్తోంది. తాజాగా హ‌న్సిక కూడా వెబ్ సిరీస్‌లో న‌టించింది. పిల్ల జ‌మిందార్‌, భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడు అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇదో రొమాంటిక్, కామెడీ వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. బోల్డ్ కంటెంట్ కూడా ఉంద‌ట‌. అలాంటి వెబ్ సీరీస్‌ల‌కే ఇప్పుడు డిమాండ్ ఉంది. ఇది అమేజాన్ కోస‌మా, నెట్ ఫ్లిక్స్ కోస‌మా అనేది తెలియాలి.

”వెబ్ సిరీస్‌లు చేయ‌డంలో ఓర‌క‌మైన సంతృప్తి దొరుకుతోంది. రాబోయే రోజుల్లో వీటిదే హ‌వా. త‌ప్ప‌కుండా మ‌రిన్ని వెబ్ సిరీస్‌ల‌లో క‌నిపిస్తాను. కంటెంట్ బాగుంటే చాలు. అవి కూడా సినిమాకి మించిన బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఎక్క‌డైనా న‌ట‌న న‌ట‌నే కాదా” అంటోంది హ‌న్సిక‌.