ఐపీఎల్‌తో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది

ఐపీఎల్‌తో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది

గాయం కారణంగా సుదీర్ఘ కాలంగా ఆటకు దూరమైన భారత జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఐపీఎల్ 2020‌కి సిద్ధమయ్యానని చెబుతున్నాడు. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా కూడా దృఢంగా తయారైనట్లు అతను వెల్లడించాడు.

‘శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను. ఎలాంటి తడబాటు లేకుండా సాగుతున్న బ్యాటింగ్‌ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మానసికంగా కూడా కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నా. మైదానంలోకి దిగి సంతృప్తికర ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నా. నా సన్నాహాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మున్ముందు అంత శుభమే జరుగుతుందని ఆశిస్తున్నా. నాకెంతో ఇష్టమైన ఐపీఎల్‌తో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. గాయాలు క్రీడాకారుల జీవితంలో భాగమేనని, అయితే వాటి కారణంగా తానెప్పుడూ వెనకడుగు వేయలేదన్న హార్దిక్‌… లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇంట్లో ఉన్న జిమ్‌ కారణంగా తన ఫిట్‌నెస్‌లో ఎలాంటి తేడా రాలేదని చెప్పాడు.