అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు…ఒకేలా మరణం !

Haroon Ahmed Bilour among 13 killed at Pakistan election rally bombing

ఉగ్రవాదుల స్వర్గధామం పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నిన్న పెషావర్ ఎన్నికల ర్యాలీలో ఉగ్రవాదులు హింసా ఖాండకు పాల్పడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా అవామీ నేషనల్ పార్టీ అభ్యర్థి హరూర్ బైలౌరీ సహా 14 మంది మృతి చెందారు. పెషావర్‌లోని యకటూబ్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 54 మంది తీవ్రంగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. హరూర్ బైలౌరీ అవామీ నేషనల్ పార్టీ ఎలక్షన్ కాండిడేట్ లలో ముఖ్య సభ్యుడు. హరూర్ బైలౌరీ తండ్రి బాషిర్ బైలౌరీ కూడా అవామీ నేషనల్ పార్టీలో ముఖ్య నాయకుడు. ఆయన కూడా 2012 ఆత్మహుతి దాడిలో మృతి చెందారు. ఇప్పుడు కొడుకు కూడా ఆత్మాహుతి దాడిలోనే చనిపోవడం మీద స్థానికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.