తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తేనె కల్తీ గురించి మనం వాడకముందు గుర్తించడం చాలా కష్ట సాధ్యం కాబట్టి కల్తీ చేసే వారి ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. కాగా.. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కార్పొరేట్ కంపెనీలు తయారు చేసిన తేనె బాటిళ్లల్లో లభ్యం అవుతుంది. కానీ వీటిలో కూడా ఏ తేనె స్వచ్ఛమైనదో గుర్తించడం కష్టంగా మారుతోంది. అనేక రకాల కంపెనీల ప్రకటనలు చూసి తేనె చూడ్డానికి బాగుంది.

తింటే కూడా బాగుంటుందేమో అని చాలా మంది ప్రజలు మోసపోతున్నారు. తీరా తేనెను కొన్నాక వారు మోసపోయామని గ్రహిస్తున్నారు. తర్వాత చేసేదేం లేక నిశ్శబ్ధంగా ఉండిపోతున్నారు. ఇలా కల్తీ తేనెను తీసుకోవడం వలన తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల మాట అటుంచితే… అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది తేనె సీసాలను ఫ్రిడ్జ్లలో నిల్వ చేస్తారు. మరలా అవసరమయినపుడు తీసుకుని వాడుకుంటారు. అవసరం తీరాక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. ఇలా స్టోర్ చేసిన తేనెను వాడొచ్చా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మందిలో అనుమానాలు ఉంటాయి. ఫ్రీజ్ చేసిన తేనెను గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఒక సారి తెలుసుకుందాం. అసలు ఈ విధంగా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన తేనెను వాడడం ఆరోగ్యానికి మంచిదేనా అని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు.

ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తే తేనె గడ్డ కడుతుందా? అని చాలామందిలో సందేహం ఉంటుంది. స్వచ్ఛమైన తేనె ఫ్రిడ్జ్లో పెట్టడం వలన గడ్డకట్టదు. కానీ తేనెలో చెక్కర మిశ్రమాన్ని గనుక కలిపితే ఫ్రిడ్జ్లో పెట్టినపుడు అది గడ్డ కడుతుంది. తేనెలో కలిపిన చెక్కర మిశ్రమంలో ఉన్న చెక్కర ఫ్రిడ్జ్లో ఉన్న చల్లదనానికి చిన్న గుళికలుగా మారుతుంది.

అసలు తేనెను ఫ్రీజ్ చేయడం ఎవరు మొదలు పెట్టారో సరిగ్గా తెలియనప్పటికీ చాలా మంది ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కొంత మంది తమ సొంత ప్రయోగాలను కూడా చేస్తున్నారు. తేనె మిశ్రమానికి మొక్కజొన్న సిరప్ను కలిపి దానిని ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడం వలన తేనె పల్చగా అవుతుందని చెబుతారు. అంతే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికి కూడా త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందని సూచిస్తున్నారు.

ఇలా ఫ్రీజ్ చేసిన తేనెను తినడం గురించి సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ఎవరెలా కామెంట్లు చేసినప్పటికీ కొంత మంది మాత్రం ఫ్రీజ్ చేసిన తేనెను తరుచూ వాడుతూనే ఉంటారు. ఈ తేనెను తినడం వలన అనారోగ్యం పాలవుతామని కొంత మంది వినియోగదారులు చెప్పగా, అలాంటిదేమీ లేదని కొంత మంది వినియోగదారులు తెలిపారు. ఇక ఇలా ఫ్రీజ్ చేసిన తేనెను తీసుకోవడం గురించి నిపుణులు ఏం చెప్పారనేది ఒక సారి గమనిస్తే…

మనలో చాలా మందికి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన తేనెను తీసుకోవచ్చా? అనే అనుమానం కలుగుతుంది. ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ ఒకరు దీనికి సమాధానంగా ఏం చెప్పారంటే.. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన హనీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వివరించారు. అన్ప్రాసెస్ తేనెను తీసుకోవడం వలన అందులో ఉండే బ్యాక్టీరియా ప్రభావంతో నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరించారు. ఈ తేనె డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న రోగులు ఈ రకమైన తేనెను తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని డాక్టర్ సూచించారు.

ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ ఒకరు మాట్లాడుతూ… గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన తేనెను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కువ మొత్తంలో తేనెను తీసుకోవడం మంచిది కాదని హెచ్చరించారు.ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే హనీ అనేది తీయగా ఉంటుంది. తేనెను తీసుకున్న తర్వాత విపిక (ఆహారం జీర్ణమైన తర్వాత కాలేయంపై ప్రభావం) తీపిగా ఉంటుంది.

తీయగా ఉన్నప్పటికీ దీని ప్రభావం శక్తి వంతంగా(ఉషా వీర్య) ఉంటుంది. దీని ప్రభావం వల్లే తేనెను అధికంగా తీసుకోవడం వలన మనకు కఫా, పిత్తా అనే వ్యాధులు వస్తాయి. (ఒబేసిటీ, దగ్గు, జలుబు, అధిక కొవ్వు మొదలైనవి). తేనె డ్రైగా ఉంటుంది (రుక్ష). దీనిని అధికంగా తీసుకోవడం వలన వాత దోషానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి (వాత దోషం అనగా… మలబద్ధకం, కీళ్ల నొప్పులు)

తేనెలో చెక్కర శాతం అధికంగా ఉంటుంది. కావున దీనిని అధికంగా తీసుకున్నపుడు కొన్ని సార్లు తలనొప్పి, కడుపునొప్పి, డయేరియా, విరేచనాలు కావడం జరగవచ్చు. అందుకోసమే తేనెను అధికంగా తీసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.

పేరున్న ఫిజీషియన్ చెప్పిన దాని ప్రకారం.. ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని, అధిక మొత్తంలో తేనెను తీసుకోవడం వలన డయేరియా, జ్వరం రావడం, కడుపునొప్పి, విరేచనాలు మొ.. వస్తున్నాయని హెచ్చరించారు. అంతేకాకుండా అధిక మొత్తంలో తీసుకున్న తేనె వలన దంతాల సమస్య ఉత్పన్నమవుతుందని డాక్టర్ హెచ్చరించారు.

తేనెను అధికంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్పడంతో అసలు రోజులో ఒక మనిషి ఎంత శాతం తేనె తీసుకోవడం మంచిదని చాలా మందిలో అనుమానం కలుగుతుంది. ఒక మనిషి రోజుకు తీసుకోవాల్సిన తేనె శాతం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో.. ఒక సారి చూద్దాం.

ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన తేనెను ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు వివరించారు. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన తేనె గడ్డకట్టి ఉంటుంది. మీరు ఒక వేళ తినాలనుకుంటే దీనిని చిన్న, చిన్న ఐస్ ముక్కలుగా తినాల్సి ఉంటుంది. దీని వలన మనకు డయేరియా, చర్మ సమస్యలు, విరేచనాలు వంటి ప్రాబ్స్లం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు.

అంతే కాకుండా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన తేనెను తీసుకోవడం వలన వాత దోషం సమస్య కూడా వస్తుంది. ముందుగానే తేనె డ్రైగా ఉంటుంది. ఇంకా మనం దానిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వలన మరింత గట్టి పడుతుంది. ఇలా డ్రై, మరియు కోల్డ్ పదార్థాలను తీసుకున్నపుడు మన శరీరంలో జాయింట్ పెయిన్స్ రావడానికి ఈ పదార్థాలు కారణమవుతాయి. గ్యాస్ర్టిక్ ట్రబుల్, తలనొప్పి మొదలైన సమస్యలు వస్తాయి.

వాత దోషంతో పాటు ఈ గడ్డ కట్టిన చల్లని తేనెను తీసుకోవడం వలన కఫా దోషం కూడా పెరుగుతుంది. చల్లని పదార్థాలను తీసుకోవడం వలన దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా తేనెను తీసుకోవడం వలన దానితో కలిగే ప్రయోజనాలకు బదులు కొత్త సమస్యలు(దగ్గు, జలుబు, తలనొప్పి లాంటివి) వచ్చి పడతాయని డాక్టర్ సూచించారు.

కావున గడ్డ కట్టిన స్థితిలో ఉన్న తేనెను చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన రక్తంలోని షుగర్ లెవల్స్, కొలెస్ర్టాల్ లెవల్స్, ఇన్సులిన్ శాతాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి చల్లగా ఉన్న స్థితిలో తేనెను అధిక మొత్తంలో తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు.ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన దాని ప్రకారం గది ఉష్ణోగ్రత వద్ద తేనెను తీసుకోవడం చాలా మంచిది. (ఇలా గది ఉష్ణోగ్రత వద్ద తీసుకోవడం వలన తేనె వలన మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

అంతే కాకుండా తేనెను సహజ స్థితిలో తీసుకోవడం ఉత్తమం. మనం దేనినైనా సరే సహజ స్థితిలో తీసుకున్నపుడు మనకు మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. (ప్రాసెస్ చేసిన వస్తువుల కన్నా.. ప్రాసెస్ చేయని వస్తువులను తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోనాలుంటాయి.) ప్రాసెస్ చేయడం వలన వస్తువు దాని సహజత్వాన్ని కోల్పోయి మనకు హాని చేసే స్థితిలోకి మారుతుంది(ఎలా ప్రాసెస్ చేస్తున్నో అనే విధానం మీద ఆధారపడి).

మనం తేనెను వాడాలని నిర్ణయించుకున్నపుడు మనం ఏ ట్రెండ్ ను గుడ్డిగా ఫాలో కాకూడదు. ముందుగా దాని ప్రామాణికతను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మనం వాడేందుకు సిద్ధం కావాలి. మీరు కొత్త పదార్థాలను వాడే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ ను సంప్రదించాలి. అన్నింటి కన్నా మీ ఆరోగ్యమే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని విషయాలను మరవడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతాయి.

ఒక వేళ మీరు ఏదైనా విషయాన్ని కొత్తగా చేయాలని భావించినపుడు ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. కొన్ని రకాల పద్ధతులు మనకు, మన శరీరానికి ప్రమాదకరంగా మారుతాయి. కావున అటువంటి పద్ధతులను ఉపయోగించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సూచించారు. కావున మీరు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన తేనెను తీసుకోవచ్చా? లేదా అనే విషయంలో ఆరోగ్య నిపుణుల సలహాను తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వారి సలహా తీసుకోకుండా ఏది పడితే అది చేస్తే మన శరీరానికి ప్రమాదం పొంచి ఉంటుంది.