ఈ పాలు తాగితే మంచిది

ఈ పాలు తాగితే మంచిది

దీనికి గల కారణం ఏమిటంటే సరైన ఆహార అలవాట్లు లేక పోవడం. పోషక విలువలు లేక పోవడం వలన ఎన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోగ నిరోధక శక్తి కి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ తప్పక తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు వ్యాపించవు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ఆహారం పై శ్రద్ధ పెట్టాలి. అన్ని రకాల విటమిన్స్ మరియు మినరల్స్ అందేలా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా విటమిన్ డి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

న్యూట్రిషన్, డైటీషియన్ మరియు కార్పొరేట్ హెల్త్ ఎడ్యుకేటర్ మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. వీటిని చూసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీనితో సమస్య నుండి బయట పడవచ్చు. విటమిన్-డి అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన మైక్రో న్యూట్రియెంట్. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలానే ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది కూడా. అందుకే ఇది అవసరం.

ఒకవేళ విటమిన్-డి లోపం ఉంటే డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ సమస్యలు, బరువు పెరిగిపోవడం, ఆటో ఇమ్యూన్ డిసార్డర్, న్యూరో మస్క్యూలర్ డిసీజెస్, ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్ మొదలైన సమస్యలు వస్తాయి. అయితే విటమిన్ డి అనేది ఒంట్లో న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి మనకు అందుతుంది. అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా మనం విటమిన్-డి పొందొచ్చు. అయితే విటమిన్ డి ఎందులో ఉంటుంది..?, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే విటమిన్-డి మనకు ఎంత అవుతుంది అనేది చూద్దాం. ఈ ఆహార పదార్థాలలో విటమిన్-డి ఎక్కువగా ఉంటుందట.

పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి ఉంటుంది. కాబట్టి డైట్‌లో పుట్టగొడుగులుని వారానికి నాలుగు సార్లు తీసుకోండి దీంతో మీకు చక్కగా విటమిన్-డి అందుతుంది. అలానే విటమిన్-డి లోపం వంటి సమస్యలు కూడా వుండవు.

ఆవు పాలు వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వికులు కూడా చెప్తూ ఉంటారు. ఆవు పాలలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఎంత ఉంటుంది అనేది మీరు తీసుకునే పాలను బట్టి ఉంటుంది. వివిధ కంపెనీల బట్టి కూడా అది మారుతూ ఉంటుంది. అయితే ఏది ఏమైనా సరే ఆవు పాలని తీసుకుంటే ఎన్నో సమస్యలు దరి చేరకుండా ఉంటాయి విటమిన్ డి నేచురల్ గా ఉండదు కానీ కాల్షియంతో ఎక్కువగా పాలు నిండి ఉంటాయి ఈ రెండూ కూడా బాగా ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి అలానే కాల్షియం కూడా బాగా అందుతుంది కాబట్టి రోజూ ఒక గ్లాసు ఆవు పాలు తీసుకుంటే కూడా మంచిది.

ఇందులో కూడా విటమిన్-డి మనకి ఉంటుంది. ముఖ్యంగా చెడ్డర్ చీజ్ లో విటమిన్-డి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఇలా చీజ్ ద్వారా కూడా మీరు విటమిన్-డి ని పొందొచ్చు. దీంతో విటమిన్-డి లోపం కలగదు.

ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కూడా విటమిన్ డి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల పది నుండి ఇరవై శాతం విటమిన్ డి మీకు అందుతుంది. అదే విధంగా బటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలానే మినరల్స్ మరియు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అంతే కాకుండా బట్టర్‌లో విటమిన్ డి కూడా ఉంటుంది ఒక స్పూన్ బటర్ రోజు తీసుకుంటే మంచిది. ఒకవేళ కనుక గుండె సమస్యలు వంటివి ఉంటే బట్టర్ తీసుకోవద్దు.

ఓట్ మీల్‌లో కూడా విటమిన్-డి ఉంటుంది అయితే బ్రాండ్‌ని బట్టి కూడా పోషక విలువలు ఉంటాయి. కనుక చూసుకుని తీసుకోండి. ఓట్ మెయిల్ ద్వారా మీకు మంచిగా ఫైబర్ అందుతుంది. అలాగే విటమిన్ డి లోపం కూడా కలగదు. కాబట్టి దీనిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.

గుడ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో విటమిన్-డి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ డి లోపం లేకుండా చూసుకుంటుంది. రోజుకి రెండు గుడ్లు తీసుకుంటే 82% విటమిన్ డి మీకు అందేలా చూస్తుంది. అయితే మొత్తం గుడ్డు తీసుకుంటే చూసుకోండి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే ఇందులో జింక్, సెలీనియం, ప్రోటీన్స్ వంటివి ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

సాల్మన్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ డి ఉంటుంది. అలాగే ఇతర పోషక పదార్ధాలు కూడా ఉంటాయి. ఎముకలకు చాలా బాగా ఉపయోగపడుతుంది 100 గ్రాముల సాల్మన్ తీసుకుంటే 62 శాతం విటమిన్ డి మీకు అందినట్లే. ఇలా విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకుని ఈ సమస్యలు లేకుండా ఉండండి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.