హార్ట్ ఎటాక్ ప్రమాదం

హార్ట్ ఎటాక్ ప్రమాదం

నిజానికి కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మీరే మీ గుండెని ప‌దిలంగా కాపాడుకోవ‌చ్చు. మ‌రి అసలు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అన్న విష‌యాలు ఇప్పుడు చూద్దాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండెకి ముప్పు పెరుగుతుంది. కాబ‌ట్టి, ఎప్పుడు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకునేందుకు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ హెల్త్‌ను మెరుగు ప‌ర‌చ‌డంలో ప్రోటీన్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

అందువ‌ల్ల‌, రెగ్యుల‌ర్‌గా మీ శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్‌ను అందించాల్సిన బాధ్య‌త మీదే.ప్రస్తుతం రోజురోజుకీ చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వస్తున్న కేసులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.అయితే యూత్‌లో హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు తెలియకున్నా, నేడు చదువులు తీవ్ర ఒత్తిడి పెరిగిపోయిన మాట వాస్తవం. అదే కాకుండా – సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, గంటలకొద్దీ ఎలెక్ట్రానిక్ పరికరాలతో గడపడం అన్నది కొత్త విషయమేమీ కాదు.

హార్ట్ ఎటాక్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, యువత తన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. గుండె సమస్యలని నివారించడంలో యోగా చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు.”జంక్ ఫుడ్స్‌, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతే కాకుండా జంక్ ఫుడ్స్‌పై వాటిని తింటే వచ్చే ప్రమాదాల గురించి పెద్దగా ముద్రించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

హార్ట్ ఎటాక్‌కి కొలెస్టరాల్ కారణం కాకపోవచ్చు కానీ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా హార్ట్ ఎటాక్‌కి కారణమని అంటారు. ట్రాన్స్ ఫ్యాట్ బాడీలో మంచి కొలెస్టరాల్‌ను తగ్గించి, చెడు కొలెస్టరాల్‌ను పెంచుతుంది. వనస్పతిలో ఎక్కువగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. అందువల్ల వాటిని వాడడం నిలిపివేయాలని నిపుణులు సూచించారు.సోడియం ఫుడ్స్‌ని నో-సాల్ట్ సీజనింగ్‌తో ఫ్లేవర్ చేయండి. లేదా ఇంకేమైనా స్పైసెస్ యాడ్ చేయండి.

ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, సాసెస్, కాన్‌డ్ ఫుడ్స్‌లో ఎక్స్ట్రా సోడియం ఉంటుంది. వీటిని ఎవాయిడ్ చేయండి.సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్. ఫ్యాటీ మీట్స్, పౌల్ట్రీ స్కిన్, హోల్ మిల్క్ డైరీ, బటర్, కోకోనట్ ఆయిల్, పాం ఆయిల్స్ అవాయిడ్ చేయండి. ఫ్రోజెన్ పీజా, మైక్రోవేవ్ పాప్ కార్న్ వంటివి కూడా ఎవాయిడ్ చేయండి.షుగర్, స్వీటెన్డ్ డ్రింక్స్, స్నాక్స్, స్వీట్స్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. సోడాలు, స్వీటెన్డ్ కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, కేక్స్, పై, ఐస్ క్రీం, క్యాండీ, సిరప్స్, జెల్లీస్… ఇవన్నీ అవాయిడ్ చేయండి.

ఆల్కహాల్ పూర్తిగా మానేయగలిగితే మంచిది. లేకపోతే మగవారు రోజుకి రెండు డ్రింక్స్, ఆడవారు రోజుకి ఒక డ్రింక్ మించి తీసుకోకూడదు. ఆల్కహాల్ బ్లడ్ ప్రెషర్‌ని పెంచి బరువు పెరిగేలా చేస్తుంది. కొంతమందిలో ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీయవచ్చు.రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ బలంగా తయారవుతుంది. ప్రతి హార్ట్ బీట్‌లోనూ ఎక్కువ బ్లడ్‌ని పంప్ చేస్తుంది. ఇందు వల్ల ఎక్కువ ఆక్సిజెన్ అందుతుంది. అందు వల్ల బాడీ ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్ గా పని చేస్తుంది.ఎక్సర్స్‌సైజ్ వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఎక్సర్‌ర్‌సైజ్‌ని హెల్దీ డైట్‌తో కంబైన్ చేసినప్పుడు వెయిట్ లాస్ కూడా త్వరగా జరుగుతుంది.