తెలంగాణలో కరోనా మహమ్మారి

తెలంగాణలో కరోనా మహమ్మారి

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగిపోతోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న వైరస్‌ మళ్లీ కోరలు చాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కరోనా బారిన పడ్డారు.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి ట్వీట్ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణలో ఆదివారం 21,679 మందికి కరోనా పరీక్షలు చేయగా 274 మందికి పాజిటివ్‌ వచ్చింది.

పాజిటివిటీ 1.26 శాతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా 212 మంది కరోనా బారినపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 6,82,489కు చేరుకుంది. ఆదివారం ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కు చేరుకుంది.