‘హలో’ ప్రివ్యూ…

Hello Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు 
నిర్మాత:   నాగార్జున 
దర్శకత్వం :   విక్రమ్ కె కుమార్ 
సినిమాటోగ్రఫీ:   పి.ఎస్. వినోద్ 
ఎడిటర్ :  ప్రవీణ్ పూడి 
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్ 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘హలో’ చిత్రం మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. అక్కినేని ఫ్యాన్స్‌ను అఖిల్‌ తన మొదటి చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చాడు. ‘అఖిల్‌’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేక పోవడంతో అఖిల్‌ సినిమా బాధ్యతను తానే స్వయంగా తీసుకుని ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించాడు. ‘మనం’ వంటి ఒక అద్బుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ రెండవ చిత్రాన్ని చేయడం జరిగింది. మొదటి సినిమా గురించి పూర్తిగా మర్చి పోయి అఖిల్‌ ఈ చిత్రాన్ని చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నాగార్జున ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించడం జరిగింది.

తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంతో నాగార్జున మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అఖిల్‌కు మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా ఈ చిత్రం మాత్రం స్టార్‌ హీరోగా నిలపడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంను ట్రైలర్‌ కల్పించింది.

ఒక విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్‌ తెరకెక్కించాడు. రమ్యకృష్ణ మరియు జగపతిబాఋ కీక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తమిళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో ఇదో భారీ విజయాన్ని సొంతం చేసుకుని 2017 బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాల జాబితాలో నిలుస్తుందని, నిలవాలని అక్కినేని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. క్రిస్మస్‌ కానుకా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘హలో’కు ఆల్‌ ది బెస్ట్‌.