‘ఎంసీఏ’లో దిల్‌రాజు చివరి నిమిషం మార్పులు

Dil Raju Edits MCA movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాని హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంపై దిల్‌రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అయిదు చిత్రాలతో సక్సెస్‌లు దక్కించుకున్న దిల్‌రాజు ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను తన బ్యానర్‌లో వేసుకుని హ్యాట్రిక్‌ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇతర హీరోల చిత్రాల్లో ఎక్కువ శాతం చిత్రాలను దిల్‌రాజు ఫైనల్‌ వర్షన్‌ చూసి కొన్ని ఎడిట్‌లు చెబుతూ ఉంటాడు. దిల్‌రాజు ఇటీవల పలు చిత్రాలకు రీ షూట్‌లు కూడా చేయించాడు. రీ షూట్‌లు చేయడం వల్ల పలు చిత్రాల ఫలితాలు మారి సక్సెస్‌ను దక్కించుకున్నాయి. అందుకే ‘ఎంసీఏ’ చిత్రంకు కూడా పదే పదే మార్పులు చేర్పులు చేయించాడు.

సినిమా విడుదలకు మరో 48 గంటలు ఉండగా కూడా దిల్‌రాజు మార్పులు చేర్పులు చేయిస్తూనే ఉన్నాడట. సెన్సార్‌ పూర్తి అయిన తర్వాత కొన్ని సీన్స్‌ను రీ ఎడిట్‌ చేయించాడు అంటూ ప్రచారం జరుగుతుంది. విడుదలకు చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ దిల్‌రాజు ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. నానికి కూడా ఈ చిత్రం చాలా కీలకం. ఇప్పటి వరకు వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని మరో సక్సెస్‌ను ఈ చిత్రంతో అందుకోవాలని ఆశతో ఉన్నాడు. అందుకే మళ్లీ మళ్లీ ఎడిట్‌లు చేస్తూ, విడుదలకు ముందు కాస్త కంగారు పడుతున్నారు. చాలా నమ్మకంతో ఉన్నా కూడా ఎక్కడో అనుమానం ఉందని, దిల్‌రాజు సన్నిహితులు చెబుతున్నారు. మరి కొన్ని గంటల్లో ఎంసీఏ ఫలితం తేలిపోతుంది. దిల్‌రాజుకు డబుల్‌ హ్యాట్రిక్‌ దక్కిందా? నానికి సక్సెస్‌ కంటిన్యూ అయ్యిందా అనేది చూడాలి.