కొత్త సంవత్సరంకు పవన్ ప్రత్యేక కానుక..!

Pawan kalyan Sings special song for Agnathavasi movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. అనిరుధ్‌ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. చిత్రంలో ఉన్న పాటల్లో అన్ని పాటలను విడుదల చేయకుండా ఒక ప్రత్యేక పాటను మాత్రం ఆపేశారు. ఆ పాటను పవన్‌ కళ్యాణ్‌ చేత పాడివ్వడం జరిగింది. అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడా కదిరి నరసింహుడా… అంటూ పవన్‌ పాడిన పాట గుర్తుంది కదా… అచ్చు అలాంటి పాట మాదిరిగానే మరో విభిన్నమైన పాటను పవన్‌తో పాడివ్వడం జరిగిందట. ఆ పాటను కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఆడియో విడుదల సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ ప్రత్యేక పాట గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఇప్పటి వరకు అలాంటి పాట ఉండబోతుందని కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా చెప్పలేదు. ఆఫ్‌ ది రికార్డ్‌ మాత్రమే ఆ పాట గురించి ప్రచారం జరుగుతుంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్‌ 31న రాత్రి సమయంలో ‘అజ్ఞాతవాసి’లోని పవన్‌ పాడిన పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌ కోసం చాలా ప్రత్యేకంగా సులభంగా ఉండేలా ఒక ట్యూన్‌ను అనిరుధ్‌ క్రియేట్‌ చేయడం జరిగింది. అప్పట్లో కొలవెరిడీ సాంగ్‌ ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందో తెల్సిందే. అదే తరహాలో ఒక మేకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేయబోతున్నారు. కొత్త సంవత్సరంలో జోష్‌ను నింపేందుకు పవన్‌ తన పాటతో రాబోతున్నాడు. ఇక చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న విడుదల చేయబోతున్నారు