లవ్‌ స్టోరీకి కామ్రెడ్‌ టైటిల్‌ ఏంటి సోదరా?

hero vijay devarakonda next movie title dear comrade.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఆ సినిమా విడుదల కాబోతుంది. ఇక నేడు ‘మహానటి’ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ట్యాక్సీవాలా ఇంకా విడుదల కాకుండానే రెండు చిత్రాలకు ఈ యువ హీరో కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి అర్జున్‌ రెడ్డికి సీక్వెల్‌ కాగా మరోటి ‘డియర్‌ కామ్రెడ్‌’. ఈ రెండు చిత్రాలు కూడా ఇదే సంవత్సరంలో విడుదల చేయాలనే పట్టుదలతో విజయ్‌ ఉన్నాడు.

పూర్తిగా కాకినాడ నేపథ్యంలోని ప్రేమ కథతో విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రెడ్‌’ సినిమా ఉండబోతుందట. భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కొత్తగా కనిపిస్తాడని, త్వరలోనే హీరోయిన్‌ను ఎంపిక చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అంతా బాగానే ఉంది కాని ప్రేమ కథకు కామ్రెడ్‌ అంటూ టైట్‌ల్‌ పెట్టడం ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల సమయంలో కామ్రెడ్స్‌ నుండి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, లేని పోని ఇబ్బందులు ఎందుకంటే కొందరు సలహా ఇస్తున్నారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇప్పటికే ‘డియర్‌ కామ్రెడ్‌’ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. కమ్యూనిస్ట్‌ పార్టీకి ఈ ప్రేమ కథకు ఏమైనా సంబంధం ఉందా అనేది చూడాలి.