టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన ధర్మాసనం

టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన ధర్మాసనం

అక్టోబరు 24న టీఎస్‌పీఎస్సీ గ్రూప్2 విడుదల చేయగా నియామకాలకు సంబంధించి మరో అవరోధం ఎదురైంది. ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించినట్లు హైకోర్టు తెలిపింది. వేసిన పిటిషన్‌లో పరీక్షలో వైట్నర్‌, ట్యాంపరింగ్‌, స్క్రాచింగ్‌ చేసిన అభ్యర్థులను సెలక్ట్‌ చేయొద్దని పేర్కొనగా దీనిపై ధర్మాసనం గ్రూప్‌2 పరీక్ష లో అలా గుర్తించిన జవాబులు తీసివేసి మిగతా వారికి ఇంటర్య్వూలు నిర్వహించాలని 1:2 ప్రకారం నియామకాలు జరపాలని కోర్టు ఆదేశించింది.

పట్టించుకోకుండా మళ్లీ అదే అభ్యర్థులను ఎంపిక చేసి గ్రూప్2 ఫలితాలను విడుదల చేశారని ఫైనల్‌ లిస్టుకు సెలక్ట్‌ కానీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా విచారించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆదేశాలు ఇచ్చేంత వరకు నియామకాలు చేపట్టడానికి వీలు లేదని విచారణను హైకోర్టు నవంబరు 25కు వాయిదా వేసింది.