కొత్త యూనిఫాంపై అభ్యంతరాలు

కొత్త యూనిఫాంపై అభ్యంతరాలు

రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా మార్షల్స్ కోసం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త యూనిఫాంపై వివాదం రేగింది. మార్షల్స్ ధరించిన దుస్తులు సైనిక యూనిఫామ్‌ను తలపిస్తున్నాయంటూ విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా కొత్త యూనిఫాంపై వివాదం రేగింది. రాజ్యసభ సెక్రటేరియట్ కార్యాలయాన్ని కొత్త డ్రెస్‌కోడ్‌పై పునఃసమీక్షించాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు కోరగా  పాటు రాజకీయ నాయకుల నుంచి పలువురు ప్రముఖుల నుండి యూనిఫామ్‌పై అభ్యంతరాలు అందాయని వెంకయ్య పేర్కొన్నారు.

యూనిఫామ్‌లో ముదురు నీలిరంగులో ఉండి, భుజాలపై చిహ్నాలు, ఆర్మీ మాదిరి బంగారు వర్ణం లోని ఏగ్విలెట్ బంగారు వర్ణపు గుండీలు ఉన్నాయి. ఇక క్యాప్ విషయానికొస్తే ఆర్మీలోని అధికారులను తలపించేలా ఉందన్న వాదనలు వస్తున్నాయి. తమ డ్రెస్ కోడ్‌ను ఆధునిక అవసరాలకు తగినట్టుగా కొత్త రూపంలోకి మార్చాలంటూ వారు ఇటీవల మార్షల్స్ వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. గతంలో మార్షల్స్ సఫారీ దుస్తులు, తలపాగాతో కనిపించేవారు. ఇపుడు మార్షల్స్ కొత్త యూనిఫామ్‌ను డ్రెస్ కోడ్‌ను సైనిక దుస్తుల తరహాలో మార్పు చేస్తూ అమల్లోకి తీసుకొచ్చారు.