శాంసంగ్‌ W20 5G ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్

శాంసంగ్‌ W20 5G ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్

ఫోన్‌ను మడత పెట్టినప్పుడు W20 5G ఫోన్‌ను స్మార్ట్‌ ఫోన్‌గా ఉపయోగించవచ్చు. అయితే పరికరాన్ని టాబ్లెట్‌గా ఉపయోగించవచ్చు. లోపల W20 5G ఫోల్డబుల్ ఫోన్ 7.3 అంగుళాల డైనమిక్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1536x2152p రిజల్యూషన్‌ను 4.2:3 కారక నిష్పత్తితో అందిస్తుంది.

చైనాలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌ సరికొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఫోల్డ్  రీబ్రాండెడ్ వెర్షన్‌ 5జీ  అప్‌ గ్రేడ్ చేసి  ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు,  డాల్బీ అట్‌మాస్‌ సపోర్ట్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ ప్రింట్‌సెన్సర్‌  ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ పవర్ షేర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వచ్చే నెల నుండి చైనాలో గెలాక్సీ ఫోల్డ్  రీబ్రాండెడ్ వెర్షన్‌ 5జీ రానుంది. దీని ధర సుమారు 1,73,000 రూపాయలుగా ఉండబోతుందని సమాచారం.