కరోనా ఎలా వ్యాపిస్తుంది… న్యూ రీసెర్చ్..?

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనే విషయంపై పరిశోధకులు, శాస్త్రవేత్తలు తీవ్ర గాలింపు చేపట్టారు. అంటే ఆలోచనలు తీవ్రంగా చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఎలా వ్యాపిస్తుంది…? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై ఏం చెప్తుంది..? కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి దగ్గినా.. ..? తుమ్మినా..?… అలాంటి సమయంలో ఎదుటి వ్యక్తిపై తుంపర్లు పడినా..? కరోనా వైరస్ మన చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటి వరకు మనం అంతా వింటున్నమాట.

అయితే తాజాగా అధ్యయనంలో ఓ విషయం తెలిసిందే. అదేమంటే… అమెరికాకు చెందిన ఓ శాస్త్రీయ పరిశోధనా సంస్థ ట్రంప్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కరోనా అనేది కేవలం దగ్గు, తుమ్ముల ద్వారానే కాదు… గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. కరోనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి దగ్గరగా ఉండి మాట్లాడినా….శ్వాస తీసుకున్నా కూడా ఎదుటి వ్యక్తికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ సంస్థ జరిపిన సర్వే ద్వారా వెల్లడించింది.