నీరు ఎలా తాగాలో తెలుసా

నీరు ఎలా తాగాలో తెలుసా

ఎలా అయితే పోషక విలువలను మనం తీసుకుంటామో మంచి నీరుకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు 8 నుండి 10 గ్లాసుల వరకు మంచినీరును ఖచ్చితంగా తాగాలి. ఈ విధంగా మంచి నీళ్లు తాగితే సరిపోదు, సరైన విధంగా కూడా తాగాలి. కాబట్టి ఎటువంటి తప్పులను సహజంగా చేస్తున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే దీని కోసం పూర్తిగా చూసేయండి.

మనలో చాలా మంది హడావిడిలో నిల్చుని నీరుని తాగుతా ఉంటాము, కానీ మన పెద్దలు ఎప్పుడూ మంచి నీళ్లును కూర్చొని తాగాలి అని గుర్తు చేస్తూ ఉంటారు. నిలబడి మంచి నీరు తాగితే మన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చెడిపోతుంది, దాని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేగాక ఆయుర్వేదం కూడా ఎప్పుడూ మంచి నీరును కూర్చొనే తాగాలి అని చెబుతుంది. ఆయుర్వేదం ప్రకారం మంచి నీరును నిలబడి తాగడం వల్ల నీళ్లు పొట్ట కింద భాగానికి చేరుతాయి, దాని వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. కనుక దీనిని అస్సలు మరచిపోవద్దు.

సమయం లేక పోవడం వలన, దాహంగా ఉండడం వల్ల మరియు ఇతర కారణాల వల్ల చాలా మంది మంచి నీరును త్వరగా తాగుతారు. ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే త్వరగా తాగడం వల్ల మన కిడ్నీలు మరియు బ్లాడర్‌లో కొన్నిరకాల మలినాలు పేరుకుపోతాయి. జీర్ణ ప్రక్రియ మెరుగుపడాలంటే మంచినీరును కొద్ది మోతాదులలో మెల్లగా తాగాలి. ఇలా తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

మన శరీరానికి కనీసం రోజుకు 8 నుండి 10 గ్లాసుల వరకు మంచినీరును తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మంచినీరును తాగడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అధిక మోతాదులో కావాల్సిన మంచి నీరు కంటే ఎక్కువ నీరును తీసుకోవడం వల్ల hyponatremia సమస్య వస్తుంది. దానినే వాటర్ ఇంటాక్సికాషన్ అని కూడా అంటారు. ఈ సమస్య రావడం వల్ల మన శరీరంలో సోడియం స్థాయిలు పడిపోతాయి, దానివల్ల బ్రెయిన్ స్వెలింగ్ మరియు కోమా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించే వారు కొన్ని వెయిట్ లాస్ డైట్స్ ను పాటిస్తారు. వీటిని పాటించేవారు భోజనంకు ముందుగా మంచినీళ్లు తాగమని సూచిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఇది అసలు సరికాదు. ఆయుర్వేద సూచనల మేరకు మనం 50 శాతం ఆహారాన్ని, 25 శాతం నీరు తీసుకోవాలని మిగిలిన 25 శాతం ఖాళీగా ఉండాలని చెబుతుంది. ఇలా చేయడం వల్ల జీర్ణప్రక్రియ సరైన విధంగా జరుగుతుంది మరియు ఆహారాన్ని తీసుకునే ముందు మంచి నీళ్లు తాగడం వల్ల సరైన పోషకాలు శరీరానికి అందవు. అంతే కాకుండా జీర్ణప్రక్రియ చెడిపోతుంది.

కొంతమంది మంచి నీళ్లు తాగలేక కొన్ని స్వీటెనర్స్ ని ఉపయోగిస్తారు. ఇటువంటి వాటిని మంచినీరుకు జత చేసి తాగడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు స్వీట్నర్స్ మీకు తాజాగా అనిపించినా, ఇవి డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడమే మంచిది. చూసారు కదా మంచి నీళ్లు తాగేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చెయ్యకూడదు అనేది. మరి వీటిని మరచిపోకుండా అనుసరించి ఏ సమస్యా లేకుండా వుండండి. అలానే ఆరోగ్యంగా వుండండి.