బాడీలో ఎంత మోతాదులో వాటర్ ఉండాలి

బాడీలో ఎంత మోతాదులో వాటర్ ఉండాలి

చాలా సార్లు వాటర్ వెయిట్‌కి కారణం ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే. అయితే బాడీలో ఎంత మోతాదులో వాటర్ ఉండాలి అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.సాధారణంగా పెద్దవారి శరీర బరువులో నీటి శాతం 50 నుండి 60 శాతం వరకు ఉంటుంది. శరీరంలోని అదనంగా ఉండే నీటిని వాటర్ వెయిట్‌గా సూచిస్తారు.శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడు.. ముఖ్యంగా పొత్తికడుపు, కాళ్లు, చేతులు ఉబ్బరంగా మారతాయి.

నీటి స్థాయిలు ఒక వ్యక్తి బరువు ఒకే రోజులో 2 నుండి 4 పౌండ్ల వరకు మారవచ్చు.శరీరంలో నీటి శాతం అధికంగా ఉంటే అది మూత్రపిండాల వ్యాధి లక్షణంగా పరిగణించాలి. ఇది చాలామంది తరచుగా చోటుచేసుకుంటుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో వాటర్ వెయిట్‌ను స్వతహాగా తగ్గించుకోవచ్చు.

సోడియం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి పెరుగుదలకు కారణం అవుతుంది. పొటాషియం, మెగ్నీషియం లోపాలు కూడా అదనపు నీటి బరువుకు కారణం కావచ్చు.మహిళల్లో సహజంగా చోటుచేసుకున్న హార్మోన్‌లలో మార్పులు అనేవి రుతుస్రావానికి ముందు వారంలో నీటి పెరుగుదలకు కారణమవుతాయి. ఉప్పగా ఉండే ఆహారాలు, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తినడం కూడా ఈ సమయంలో శరీరంలో వాయిర్ వెయిట్‌కు దారితీస్తాయి.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరంలో ఉండే అధిక శాతం నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అదే వ్యాయామం చేయకపోయినా, ఎక్కువసేపు కూర్చోవడం, నిలబడటం వల్ల శరీరం చుట్టూ ద్రవాలు సరిగా ప్రసరించడం ఆగిపోతాయి. దీంతో శరీర కణజాలం చుట్టూ నీరు పేరుకుపోతుంది. ఇది శరీర అంత్య భాగాలలో వాపుకు దారితీస్తుంది.

గుండె లేదా మూత్రపిండాల వ్యాధి: మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం చుట్టూ సాధారణ రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఈ అంతరాయం ద్రవాల పెరుగుదలకు కారణమవుతుంది. ఫలితంగా శరీరంలో వాపు, అదనపు నీటి బరువు ఏర్పడుతుంది.ఎక్కువగా మెడిసిన్స్ వాడే వారి శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు తీసుకునే ఔషధాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీలు, కొన్ని నోటి గర్భనిరోధకాలు ఉంటాయి. అందువల్ల ఏవైనా మందులు ఆందోళన కలిగించే దుష్ప్రభావాలను కలిగిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ ఉప్పు‌ని డైల్యూట్ చేయడానికి కిడ్నీలు ఎక్కువ నీటిని ఉంచేస్తాయి. ఇదే కాక హార్మోనల్ ఛేంజెస్, మెన్స్ట్రువల్ సైకిల్ కూడా పఫ్ఫీనెస్‌కి దారి తీస్తుంది. అమెరికా పరిశోధకుల మార్గదర్శకాల ప్రకారం మనిషి రోజుకు 2,300 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తీసుకోకూడదని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా సోడియం ఉంటుంది. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటే శరీరంలో సోడియం లెవల్స్ పెరుగుతాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు వాటర్ బ్యాలెన్స్‌ని కంట్రోల్ చేయడంపై వెంటనే ప్రభావం చూపుతుంది. ఉప్పు ఎక్కువైతే వాటర్ రెటెన్షన్ కూడా పెరుగుతుంది. తద్వారా బ్లోటింగ్‌కి దారి తీస్తుంది. ప్రాసెస్డ్ మీట్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటి వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సోడియంరహిత డైట్‌ని ఫాలో అవ్వకండి. శరీరానికి కొంత ఉప్పు అవసరం. అప్పుడే అది సరిగ్గా పని చేస్తుంది.

వాటర్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి వాటర్ తాగాలి అంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. కానీ ఇది నిజం. మీరు తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా బాడీ వాటర్‌ని రిగెయిన్ చేస్తుంది. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగండి. ఇంత కంటే ఎక్కువ కూడా తాగవచ్చు. నీటితో పాటు నిమ్మరసం కలిపిన నీరు, మజ్జిగ, గ్రీన్ టీ కూడా వాటర్ రిటెన్షన్‌ని తగ్గిస్తాయి.

ఎందుకంటే నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు తాగే నీరు శరీరంలో సోడియం వ్యవస్థ నుంచి అదనపు నీటిని బయటకు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. అందువల్ల పెద్దలు రోజుకు దాదాపు 2 లీటర్ల నీరు తాగాలి. చక్కెర పానీయాలను స్వచ్ఛమైన నీటితో భర్తీ చేయడం అనేది శరీరానికి కావాల్సిన నీటి అవసరాలను తీర్చడానికి గొప్ప మార్గం.

బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కి పొటాషియం ఎంతో అవసరమైన మినరల్. పొటాషియం బాగా తగ్గినప్పుడు ఫ్లూయిడ్ రిటెన్షన్ జరుగుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు బాడీ ఎక్కువగా ఉన్న నీటిని బయటకు పంపేస్తుంది. యాప్రికాట్స్, అరటి పండు, డేట్స్, కివీ, మామిడి పండు, కమలా పండు, బొప్పాయి, క్యారెట్, పప్పు ధాన్యాలు, బఠానీ, అవకాడోల్లో పొటాషియం లభిస్తుంది.

ఫైబర్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది బ్లోటింగ్, వాటర్ రిటెన్షన్‌కి దారి తీయవచ్చు. రోజుకి స్త్రీలు 25 గ్రాముల ఫైబర్, పురుషులు 38 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల తగినంత ఫైబర్ అంది కాన్స్టిపేషన్ సమస్య తగ్గి, వాటర్ వెయిట్ రెడ్యూస్ అవుతుంది.

లో క్యాలరీ డైట్ కన్నా కూడా వాటర్ వెయిట్ తగ్గడానికి లో కార్బ్స్ డైట్ బాగా పని చేస్తుంది. కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తగ్గిస్తే వాటర్ వెయిట్‌ని త్వరగా రెడ్యూస్ చేసుకోవచ్చు. బ్రెడ్, పాస్తా, పేస్ట్రీలు, కూల్ డ్రింకులు వంటి వాటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి వీటిని తగ్గించి తీసుకోవాలి.