బిగ్‌బాస్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

hrc complaint against bigg boss 2

తెలుగు బిగ్‌బాస్‌ ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒక వివాదం ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది. ముఖ్యంగా రెండవ సీజన్‌ ప్రారంభం నుండి ప్రతి రోజు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా బిగ్‌బాస్‌ షోపై మానవ హక్కుల సంఘంకు ఫిర్యాదు అందింది. ఒక ఇంట్లో 16 మందిని నిర్బంధించి, వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. బిగ్‌బాస్‌ నిర్వాహకులు డబ్బు కోసం ఇలా చేస్తున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కొంత మందిని వారి హక్కులు ఉల్లంగించి ఒక ఇంట్లో బంధించడం ఏమాత్రం కరెక్ట్‌ పద్దతి కాదు అంటూ హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో పిటీషనర్‌ పేర్కొన్నాడు.

bigg-boss-2

గత కొన్ని రోజులుగా బిగ్‌బాస్‌కు ప్రేక్షకుల్లో పమంచి ఆధరణ దక్కుతుంది. ఆ ఆధరణ చూడలేక కొందరు ఇలాంటి ప్రయత్నాలు, పనులు చేస్తున్నారు అంటూ స్టార్‌ మా వర్గాల వారు అంటున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 సూపర్‌ హిట్‌ అయ్యిందని, మరో మూడు వారాల్లో షో పూర్తి కాబోతుందని వారు చెబుతున్నారు. మొదటి సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌తో నిర్వాహకులకు మరియు స్టార్‌ మా వారికి లాభాలు ఎక్కువగా దక్కాయి అంటూ సమాచారం అందుతుంది. మొదటి సీజన్‌తో పోల్చితే ఈసారి నాలుగు వారాలు ఎక్కువగా ఉంది. అందుకే షో ఆసక్తికరంగా మారింది అంటూ షోను ఫాలో అవుతున్న వారు అంటున్నారు. ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రస్తుతం ఉన్న వారిలో కౌశల్‌కు ఎక్కువగా టైటిల్‌ గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ తెలుగు ప్రేక్షకులను రంజింప జేస్తోంది. ఇలాంటి సమయంలో హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు నమోదు అవ్వడం బాధాకరం.

 bigg boss 2