భార్యని చంపిన భర్త

భార్యని చంపిన భర్త

తన సోదరిని ఆమె భర్తే బలవంతంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి సోదరుడు జి. రాజు గురువారం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొండపాలెం పంచాయతీకి చెందిన టెక్కలి దేవి (28) గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమెను భర్త టెక్కలి లక్ష్మణ చంపేసి పట్టాలపై పడేశాడని.. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్నాడని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.