హైపర్ ఆది హీరోగా కనిపించే అవకాశాలు

హైపర్ ఆది హీరోగా కనిపించే అవకాశాలు

అతి తక్కువ కాలంలోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది హైపర్ ఆది అని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా చాలా మంది నటులు అత్యంత పేరు గడించారు. అలాంటి పేర్లు వరుసగా చెప్పుకుంటూ పొతే హైపర్ ఆది అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. కాగా తాజాగా ఒక ప్రైవేట్ మీడియా వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన హైపర్ ఆది మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

కాగా ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆది… సుడిగాలి సుదీర్ అంటే తనకు చాలా ఇష్టమని, తాను హీరో గా నటించిన చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. ఇకపోతే తమ పరిచయం మొదటగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందని, ఆ తరువాత వారు కలసి చాలా స్కిట్స్ చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో తాను కూడా హీరోగా కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయని, ప్రస్తుతానికి కథలు వింటున్నానని వెల్లడించారు. అయితే ఎలాంటి సినిమా చేయనున్నారు అనే మీడియా అతని ప్రశ్నకు సమాధానంగా… తనకు డాన్సులు, ఫైట్లు పెద్దగా సెట్ అవ్వవని, ఒకవేళ చేసినా కూడా అవి కూడా కామెడీగానే కనిపిస్తాయని, అందుకని ఎలాంటి డాన్సులు, ఫైట్లు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.