ఇదం జగత్ టీజర్…న్యూస్ కూడా క్రియేట్ చేయాలి

idam jagath movie review

న్యూస్ ఉంటే పట్టుకోవాలి.. లేదంటే లేని న్యూస్ కూడా క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్రేమ న్యూసే.. పగ న్యూసే.. చావు న్యూసే.. చావకపోయినా న్యూసే ఇవి సుమంత్ హీరోగా నటించిన “ఇదం జగత్” టీజర్ లోని డైలాగ్ లు. ఈ దైల్గ్స్ వింటుంటేనే అసలేమాత్రం అంచనాలు లేని సినిమా కూడా అంచనాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ వైసిపి అధినేత జగన్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో అనిల్ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ మధ్య కాలంలో దాదాపు అందరు నవ దర్శకులు ఏదో ఛాన్స్ దొరికింది కదా అని సేఫ్ గేమ్ కాకుండా ఆసక్తికరమైన కథ, కథనంతో వస్తున్నారు.Sumanth Idam Jagath movie

ఇప్పుడు అనిల్ కూడా అదే దారిని ఎంచుకున్నాడు. టీజర్ చూసినపుడే “ఇదం జగత్” ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది. మళ్లీరావా సినిమా నుండి సుమంత్ కథల ఎంపికలో రాటుదేలినట్టు కనిపిస్తుంది. మళ్లీరావాతో ప్రశంసల దగ్గరే ఆగిన ఈ హీరో.. “ఇదం జగత్”తో కచ్చితంగా కమర్షియల్ హిట్ కూడా కొట్టేలా కనపడుతున్నాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిగా మీడియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. అంజు కురియన్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. మొత్తానికి సుమంత్ ఆశలను “ఇదం జగత్” ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.