కెనడాపై భారత్ రివేంజ్.స్టార్ట్స్ …!

India's revenge on Canada. Starts...!
India's revenge on Canada. Starts...!

ఖలిస్థానీ వివాదం భారత్ – కెనడాల మధ్య చిచ్చు రాజేస్తోంది. రోజురోజుకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపిస్తూ.. ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను భారత్‌ తీవ్రంగా ఖండించింది. కెనడాకు గట్టిగా బదులిస్తూ.. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ వెల్లడించింది.

భారత్‌లో కెనడా హైకమిషనర్‌ అయిన కామెరూన్‌ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ నేడు సమన్లు జారీ చేస్తూ భారత్‌లోని సీనియర్‌ కెనడియన్‌ దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కెనడా హైకమిషనర్‌కు తెలిపింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆ దౌత్యవేత్తను బహిష్కరించామని విదేశాంగ శాఖ వెల్లడించింది.