“పుష్ప 2 ది రూల్” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“పుష్ప 2 ది రూల్” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా కి సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ భరద్వాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“పుష్ప 2 ది రూల్” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Pushpa the Rule-2

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక పుష్ప 2 ది రూల్, పార్ట్ 1 కి మించి ఉంటుంది అని అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, ధనంజయ, ఫాహద్ ఫజిల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు . మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.