“మురారి” రీరిలీజ్ రన్ టైం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ .!

Interesting news on "Murari" rerelease run time.!
Interesting news on "Murari" rerelease run time.!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన రీసెంట్ మూవీ “గుంటూరు కారం”  కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ( Rajamouli SSMB 29) మూవీ పై మహేష్ మొత్తం ఫోకస్ చేయగా ఇక మహేష్ నుంచి కొన్నాళ్ల వరకు ఎలాంటి కొత్త మూవీ ఉండదు అని అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు. దీనితో ఇక మళ్ళీ వాళ్ళకి రీరిలీజ్ మూవీ లే మిగిలాయని చెప్పాలి.

Interesting news on "Murari" rerelease run time.!
Interesting news on “Murari” rerelease run time.!

అలా ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా తన కెరీర్ క్లాసిక్ హిట్ మూవీ “మురారి” అయితే ఫిక్స్ అయ్యింది. మరి ఈ మూవీ రీ రిలీజ్ పై ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఈ మూవీ ఒరిజినల్ గా 182 నిమిషాల నిడివితో వచ్చింది. అంటే మూడు గంటలకి పైగానే ఈ మూవీ విడుదల అవ్వగా ఇప్పుడు రీరిలీజ్ లో మాత్రం 18 నిమిషాలు తగ్గించినట్టుగా కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చారు. దీనితో రీరిలీజ్ ప్రింట్ 164 నిమిషాలకి కుదించబడ్డ వెర్షన్ రానున్నది అని చెప్పాలి. మరి ఇందులో ఏ సన్నివేశాలు కట్ చేసారో అనేది చూడాలి.