అతడి​కి 15 కోట్లు

అతడి​కి 15 కోట్లు

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌, భారత లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయిని తమ జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురి కోసం లక్నో ఫ్రాంఛైజీ 30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్‌ను మొదటి ఆప్షన్‌గా ఎంచుకున్న యాజమాన్యం అతడి కోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించగా… స్టొయినిస్‌ను 11 కోట్లు, రవి బిష్ణోయిని 4 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పర్సులో 60 కోట్ల రూపాయలతో లక్నో మెగా వేలంలో పాల్గొననుంది. కాగా రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా వెంచర్స్‌ లిమిటెడ్‌ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

రాహుల్‌ ఆడిన 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్‌. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పాండ్యా, రషీద్‌ కోసం రూ. 15 కోట్లు.. గిల్‌కు రూ. 7 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్‌ మెగా వేలం-2022 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.