చిన్నారి తైమూర్‌ కి తమ్ముడా చెల్లెలా ..

చిన్నారి తైమూర్‌ కి తమ్ముడా చెల్లెలా ..

కరీనా కపూర్‌ ఖాన్‌ రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్తలపై ఆమె తండ్రి రణదీర్‌ కపూర్‌ స్పందించారు. కరీనా ప్రెగ్నెంట్‌ అని సమాచారం లేదని, అయితే ఆ వార్తలు నిజమైతే బాగుంటుందని అన్నారు. తైమూర్‌ ఖాన్‌కి తోబుట్టువు వస్తే సంతోషిస్తానని తెలిపారు. కాగా, సైఫ్‌ అలీఖాన్‌, కరీనా దంపతులకు తొలి సంతానం మూడేళ్ల చిన్నారి తైమూర్‌ ఉన్న సంగతి తెలిసిందే. 2018 లో‘ స్టారీ నైట్‌ 2 ఓహ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న కరీనా రెండేళ్ల తర్వాత రెండో సంతానం గురించి ఆలోచిస్తానని చెప్పింది. కరీనా ప్రాణ స్నేహితురాలు అమృతా అరోరా స్పందిస్తూ.. తాను విదేశాలకు వెళ్తున్నానని, ఏదైనా విశేషం ఉంటే చెప్పాలని అప్పట్లో జోక్ చేసింది.

అయితే, 2020 వచ్చేయడంతో కరీనా గర్భవతి అని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమృతా అరోరా ఉప్పందించడం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. కరీనా అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తోంది. అమీర్ ఖాన్‌తో కథానాయకుడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్‌కి రీమేక్. ఈ ఏడాది డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం మొదట ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన బ్రేక్‌ కారణంగా సినిమా షూటింగ్‌ జరగలేదు. అందువల్ల ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్రబృందం పేర్కొంది.