డబుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధమా?

డబుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధమా?
లేటెస్ట్ న్యూస్ ,మూవీస్ ,ఎంటర్టైన్మెంట్

డబుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధమా? ఆర్ఆర్ఆర్ భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ ఇంకా తెరపై కనిపించలేదు. ఈ సినిమా తనకి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వరుస సినిమాలే అందుకు నిదర్శనం.
ఎన్టీఆర్ రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ మనకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడంటూ మీడియాలో ఓ క్రేజీ న్యూస్.
అవును ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ధృవీకరణ లేదు కానీ బజ్ అలాగే ఉంది. ఇప్పటికే ‘అదుర్స్’లో చేసిన ద్విపాత్రాభినడయం, ‘జై లవకుశ’లో త్రిపాత్రాభినయం చేయడం ఎన్టీఆర్‌కి కొత్త కాదు. #NTR30లో తండ్రీకొడుకుల పాత్రలు పోషిస్తాడని అంటున్నారు.

డబుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధమా?
లేటెస్ట్ న్యూస్ ,మూవీస్ ,ఎంటర్టైన్మెంట్

 

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సముద్ర తీరాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ చిత్రం విఎఫ్ఎక్స్‌లో ఎక్కువగా ఉంది మరియు దీని కోసం టాప్ టెక్నీషియన్లను నియమించారు. మరి ఎన్టీఆర్ , కొరటాల ఏమంటున్నారో చూడాలి. ఇంతకుముందు వీరిద్దరూ కలసి ‘జనతా గ్యారేజ్‌’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచారు.