సీఎం రమేశ్ సంస్థల ఐటీ సోదాలు…బావ గృహ నిర్బంధం…!

IT Rides On TDP MP CM Ramesh House And Offices

తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ నివాసం, కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న అర్థరాత్రి వరకూ హైదరాబాద్ లోని రమేశ్ నివాసంతో పాటు రిత్విక్ కంపెనీలో సోదాలు కొనసాగాయి. తాజాగా ఈ రోజు ఉదయం అధికారులు మళ్లీ తనిఖీలను ప్రారంభించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సీఎం రమేష్ బావని ఐటీ అధికారులు గృహ నిర్బంధంలో పెట్టారు.

cm-ramesh

అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ సోసైటీ లో ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయానికి ఆయన్ని ఐటి అధికారులు తీసుకొని వచ్చారు. దాదాపు 50 నుంచి 100 మంది ఐటీ అధికారులు ఉదయాన్నే హైదరాబాద్ లోని సీఎం రమేశ్ నివాసం, మిగిలిన కార్యాలయాలకు చేరుకుని సోదాలు మొదలుపెట్టారు. రిత్విక్‌ సంస్థ నుంచి ఇప్పటివరకూ అధికారులు 8 హార్డ్‌ డిస్క్‌లు, 18 పెన్‌ డ్రైవ్‌లు, 6 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

IT-Raids