లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఆర్‌బీఐ కీలకవడ్డీ రేట్లను తొమ్మిదోసారి యథాతథంగా కొనసాగించడం, అంతర్జాతీయంగా సూచీలు మిశ్రమంగా స్పందించడంతో లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, రియల్టీ రంగాల్లో ఎదురైన ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు, మధ్యాహ్నం తర్వాత తిరిగి కొలుకొని చివరకు స్వల్ప లాభాలలో ముగిశాయి.

ముగింపులో, సెన్సెక్స్ 157.45 పాయింట్లు  పెరిగి 58,807.13 వద్ద ఉంటే, నిఫ్టీ 47 పాయింట్లు  లాభపడి 17,516.80 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.55 వద్ద ఉంది. నిఫ్టీలో ఐటీసీ, ఎల్ & టీ, ఏషియన్ పెయింట్స్, యుపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా లాభపడితే.. నష్టపోయిన వాటిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్ కంపెనీ, నెస్లే ఇండియా, ఎన్టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు ఉన్నాయి. బ్యాంకు & రియాల్టీ మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసిజి, చమురు & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి.