జబర్దస్త్ చంటి కారుకి ఆక్సిడెంట్ !

jabardasth chalaki chanti escaped from Road accident

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయి పలు చిత్రాల్లో కూడా హాస్య నటుడిగా చాన్సులు కొట్టేసిన చలాకీ చంటి(విని మోహన్)కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయరహదారి పై ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు ఆయనకి ఎటువంటి గాయాలు అవలేదు. అయితే విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.