సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలి : జగన్

సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలి : జగన్

సన్నబియ్యం ఇస్తామని తాము చెప్పామంటూ.. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని జగన్ తోసి పుచ్చారు. సాక్షిలో వచ్చిందంటూ.. టీడీపీ సభ్యులు అరుస్తూండటంతో… ఆ విషయంపైనా జగన్ వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు పొరపడినట్లే.. సాక్షి పత్రిక సిబ్బంది కూడా.. నాణ్యమైన బియ్యానికి బదులు సన్నబియ్యం అని రాశారని వివరించారు. సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం గతంలో తాము చేసిన ప్రకటనలకు..తమకు కావాల్సిన అర్థమే తీసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొదటి కేబినెట్ సమావేశంలో… సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అనేక సార్లు పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని కూడా.. అదే విషయాన్ని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. తీరా అమలు చేసే సమయానికి ఇబ్బందులు వచ్చాయి. ఆ విషయాన్ని నేరుగా చెప్పి… నాణ్యమైన బియ్యాన్ని ఇస్తామని ప్రకటిస్తే.. సరిపోయేది కానీ.. అసలు సన్నబియ్యం హామీ ఇవ్వలేదనే… వాదన ప్రారంభించడంతో.. టీడీపీ దీన్నో అస్త్రంగా మార్చుకుంది. పదే పదే హైలెట్ చేస్తూ.. ప్రజల దృష్టిలో పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.