రాష్ట్రంలోని పేద ప్రజల కోసం జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలోని పేద ప్రజల కోసం జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నాక రాష్ట్రంలోని ప్రజలందరి కోసం ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని పేద ప్రజల కోసమని మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ఇప్పటికే పలు కీలకమైన పథకాలు అమలు చేసిన సీఎం జగన్, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా, నవరత్నాల్లో ఒకటైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. కాగా రానున్న ఉగాది పర్వదినాన రాష్ట్రంలోని అర్హులైన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి అధికార వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే తగు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

అయితే ఈ పథకానికి అవసరమైన ప్రభుత్వ భూములను కేటాయించడంతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగతంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు, వ్యక్తులకు పెద్ద ఎత్తున భూములను కేటాయించిన సంగతి విదితమే. కాగా ఆ భూముల్లో వాడకంలో లేనటువంటి భూములని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం. కాగా ఈమేరకు అధికారులు కసరత్తులు కూడా మొదలెట్టారని సమాచారం. అయితే అలా స్వాధీనం చేసుకున్న భూములను ఇళ్ల పట్టాలకు కేటాయించాలని, వైసీపీ ప్రభుత్వం పలు ఆదేశాలతో కూడిన జీవో ని విడుదల చేసింది.