జగన్ ఆ మీటింగ్ కి వెళితే ముందస్తు ఎన్నికలు ఖాయం.

Jagan-Meeting-with-Modi-Lea

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 లో జరగాల్సిన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ?. ఎప్పటిలాగానే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేక షెడ్యూల్ కన్నా ముందుగా ఈ ఏడాది చివరిలో జరుగుతాయా ? ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగింది బీజేపీని ఏకచత్రాధిపత్యంగా నడిపిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయమే. కానీ ఈ ఇద్దరితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఎన్నికల గురించి చెప్పగలరు. ఆయన ఇంకెవరో కాదు. వైసీపీ అధినేత జగన్. కనీసం nda లో భాగస్వామి కూడా కాని జగన్ కి ఈ విషయం ఎలా తెలుస్తుందబ్బా అనుకుంటున్నారా ? అక్కడే వుంది లోగుట్టు.అదేమిటో విప్పుదాం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుస్తానో, టీడీపీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో వున్నారు వైసీపీ అధినేత జగన్. ఇక్కడ ఎవరు గెలిచినా కేంద్రంలో మాత్రం మెజారిటీ కాస్త అటుఇటు అయినా మోడీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు జగన్. అందుకే అవినీతి కేసుల నుంచి బయటపడాలంటే మోడీ అండ కావాలి. అందుకే ఏపీ ప్రజలు విభజన హామీలు తుంగలో తొక్కిన బీజేపీ అంటే మండిపడుతున్నా లెక్క చేయకుండా ఆ పార్టీతో పొత్తుకు తహతహలాడిపోతున్నారు. ఈ విషయాన్ని ఇంకా బలంగా బీజేపీ అధిష్టానానికి చెప్పడానికి జగన్ ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికితే ఇప్పుడు జరుపుతున్న పాదయత్రకి బ్రేక్ ఇచ్చి మరీ ఆయనతో భేటీ అయ్యి పొత్తుల గురించి మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ కోసం బీజేపీ , rss ల నుంచి పనిచేస్తున్న ఇద్దరు యువ నాయకులు ఇప్పటికే అధిష్టానం దగ్గరికి విషయం చేరవేశారు. కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఒకవేళ మోడీ ,షా ముందస్తు ఎన్నికలకు వెళ్లదలుచుకుంటే , టీడీపీ తో పొత్తు వద్దనుకుంటే మాత్రం జగన్ కి అపాయింట్ మెంట్ ఇచ్చేస్తారు. ఈ పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర కి బ్రేక్ ఇచ్చి ఢిల్లీ వెళ్లి మోడీతో భేటీ అయ్యారంటే మాత్రం ముందుస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నట్టే.