కోడి కత్తి నిందితుడికి అస్వస్థత… ప్రాణ హాని ఉందని కేకలు…!

Janupalli Srinivasa Rao Illnesses

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో కేజీహెచ్‌కు నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు తరలించారు. శ్రీనివాసరావును పోలీసులు భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు.

jagan-illmess

ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. అయితే తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏమిటీ అని అడిగితే నాకు వైద్యం కాదు. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్‌ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు చెప్పారు. కెజీహెచ్ లో శ్రీనివాస్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తనకు ప్రాణ హాని ఉందని, తాను రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని శ్రీనివాస్ అన్నట్లు చెబుతున్నారు. మీడియాతో మాట్లాడనీయకుండా పోలీసులు శ్రీనివాస్ తీసుకుని వెళ్లారు.

jagan-murder-case

ప్రజల మంచికోసమే తాను జగన్ పై దాడి చేశానని అన్నాడు. తన ప్రాణహాని ఉందంటూ అతను అరిచాడు. తాను మరణిస్తే తన అవయవాలు దానం చేయాలని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో ఇపుడు మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు శ్రీనివాస్ స్లో పాయిజన్ లాంటిది ఏమైనా తీసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రతి 48 గంటలకు కస్టడీలో ఉన్న నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలి. అందులో భాగంగానే ప్రైవేట్ వైద్యునితో పరీక్షించామన్నారు. కోర్టుకి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ కేజీహెచ్‌కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు. పరీక్షలు అవ్వగానే మళ్లీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తామన్నారు. విచారణ సాఫీగా సాగుతోందని చెప్పారు.

jagan-murder