భారం అంతా బోయపాటి మీదే

Jayajanaki Movie Successs Depends On Director Boyapati Srinu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాని దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన బోయపాటి శ్రీను కారణంగానే ఈ సినిమాను చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా పూర్తి ప్రమోషన్‌ బాధ్యతులు కూడా ఆయనపైనే వేసేసుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా ఇది బోయపాటి సినిమా, మాస్‌ ఆడియన్స్‌ తప్పకుండా ఈ సినిమాను ఆధరిస్తారనే ఉద్దేశ్యంతో భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది.

ఇప్పటి వరకు ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లకొండ శ్రీనివాస్‌కు పెద్దగా క్రేజ్‌ దక్కలేదు. ఈ సినిమాతో అయినా ఈ యువ హీరోకు భారీ సక్సెస్‌ దక్కి టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. తన కంటే బోయపాటి బ్రాండ్‌ వ్యాల్యూ ఎక్కువ కనుక ప్రమోషన్స్‌లో ఆయన్నే ఎక్కువగా ఫోకస్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఫేమ్‌ ఉన్న హీరోయిన్‌ కనుక ఆమెను కూడా ప్రమోషన్స్‌ కూడా ఫుల్‌గా వాడేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు బోయపాటిపై పెట్టుకున్న నమ్మకం నిలుస్తుందా, సినిమా సక్సెస్‌ అవుతుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

పతాంజలి సినిమా రాబోతుందా?

‘లై’ దర్శకుడికి కొత్త జాబ్‌!