పతాంజలి సినిమా రాబోతుందా?

social-media-jokes-on-ramdev-baba-pathanjali-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతీయులకు పతాంజలి ఎంతగా పరిచయం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తినే తిండి నుండి దాదాపు అన్ని రంగాల్లో కూడా పతాంజలి కనిపిస్తూనే ఉంది. ఇటీవ వేసుకునే డ్రస్‌లను కూడా పతాంజలి తయారు చేసేందుకు సిద్దం అయ్యింది. పతాంజలికి ఈ స్థాయిలో మార్కెట్‌ కలగడానికి ప్రధాన కారణం బాబా రామ్‌ దేవ్‌ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పతాంజలికి చెందిన పు ప్రాడెక్ట్‌కు స్వయంగా రామ్‌ దేవ్‌ బాబా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా రామ్‌ దేవ్‌ బాబా సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు. 

రామ్‌ దేవ్‌ బాబా ఏం చేసినా కూడా పతాంజలి పేరుతో చేస్తాడు. అందుకే ఇటీవల రామ్‌ దేవ్‌ బాబా సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే అది కూడా పతాంజలి సినిమానేనా అంటూ సోషల్‌ మీడియాలో జోకులు తెగ వస్తున్నాయి. పకృతి నుండి వచ్చే వస్తువును పతాంజలి వస్తువులు అంటారు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా పకృతి నుండి వస్తుంది అని కొందరు నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రామ్‌ దేవ్‌ బాబా చేయబోతున్న సినిమాపై సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌లో ప్రచారం జరుగుతుంది. లోమ్‌ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో బాబా దేశ ఔనత్యంను చెప్పే సీన్స్‌లలో కనిపించబోతున్నాడని బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు:

లై …తెలుగు బులెట్ ప్రివ్యూ.

నాలుగేళ్లు కుద‌ర‌దు… ప్ర‌భాస్‌

‘సాహో’ గురించి ఆసక్తికర విషయం