నాలుగేళ్లు కుద‌ర‌దు… ప్ర‌భాస్‌

Prabhas Says Not Giving To 4 Years Call Sheets Again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

నాలుగేళ్లు ఏ సినిమా ఒప్పుకోకుండా బాహుబ‌లి 1, 2 పూర్తిచేసి దేశ‌వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు పొందారు ప్ర‌భాస్‌. బాహుబ‌లి సినిమాలు చేసే స‌మ‌యంలో ఆయ‌న మ‌రే ప్రాజెక్టూ ఒప్పుకోలేదు. మ‌రి మ‌ళ్లీ అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు వ‌స్తే మ‌రోసారి అలా త‌న డేట్స్ బ్లాక్ చేస్తారా… ఈ బాహుబ‌లి అంటే అవున‌నే స‌మాధాన‌మిచ్చారు ప్ర‌భాస్‌. అయితే ఎంత గొప్ప ప్రాజెక్టు అయినా నాలుగేళ్లు కేటాయించ‌లేన‌ని, రెండేళ్ల కాల్షీట్లుమాత్రం ఇస్తాన‌ని చెప్పారు. నాలుగేళ్లు అనేది చాలా ఎక్కువ కాల‌మ‌ని, ఓ న‌టుడి జీవితంలో అవి చాలా విలువైన‌వి అన్న ప్ర‌భాస్ బాహుబ‌లి కోసం కేటాయించిన స‌మ‌యం త‌న‌కు చాలా నేర్పించింద‌ని తెలిపారు.

ఇప్పుడు ఎంత గొప్ప క‌థ‌క‌యినా మ‌రోసారి నాలుగేళ్లు కాలాన్ని వెచ్చించ‌టం క‌ష్ట‌మ‌ని, కానీ క‌థ త‌న‌కు న‌చ్చితే రెండేళ్లు షూటింగ్ లో పాల్గొంటాన‌ని చెప్పారు. సినిమా అంటే త‌న‌కెంతో మ‌క్కువ అని అందుకే బాహుబ‌లి కోసం హెయిర్ స్ట‌యిల్‌, గ‌డ్డం, మీసాలు పెంచీ… షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు అలానే ఉన్నాన‌ని ప్ర‌భాస్ తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. ముంబైలో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. బాహుబ‌లితో ప్ర‌భాస్ జాతీయ స్థాయిలో ఇమేజ్ సాధించ‌టంతో సాహోను తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. సాహో సినిమా కోసం అటు టాలీవుడ్ తో పాటు..బాలీవుడ్ సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

  మరిన్ని వార్తలు:

‘సాహో’ గురించి ఆసక్తికర విషయం

గుణశేఖర్‌ క్లారిటీ.. అదే కాని అది కాదు!

ఆ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ…