జయ జానకి నాయక ప్రివ్యూ.

jaya janaki nayaka Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న ప్రయత్నమే జయజానకి నాయక. ప్రయత్నం శ్రీనివాస్ ది అయినా బాధ్యత , నమ్మకం అంతా బోయపాటి మీదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ చిత్రాలతో భారీ విజయాలు నమోదు చేసిన బోయపాటి ఈసారి రొమాంటిక్ యాక్షన్ డ్రామా ని ఎంచుకున్నాడు. బోయపాటి తన తొలిసినిమా భద్ర తర్వాత చేస్తున్న సినిమాల్లో లవ్ ఎలిమెంట్ కి ప్రాధాన్యం ఇచ్చిన సినిమా జయ జానకి నాయక.

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లవ్, యాక్షన్ ని సమ పాళ్ళలో రంగరించారు. స్టార్ ఉంటేనే సినిమా తీయగలడు, యాక్షన్ కి మాత్రమే పనికొస్తాడు అనే ముద్ర నుంచి బయటపడడానికి బోయపాటి ఈ సినిమాని తనకు తానే ఓ పరీక్ష పెట్టుకుని చేసాడు. ఆ పరీక్షలో పాస్ అవుతానన్న నమ్మకంతో రెండు గట్టి సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ రిలీజ్ కి వెనుకాడలేదు. ఇక ఈ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎంతో ముఖ్యం. దేవిశ్రీ చేసిన మ్యూజిక్ ఇప్పటికే సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. రేపు విడుదలకి సిద్దమై, బోయపాటి మీద అంచనాలు తో వస్తున్న జయ జానకి నాయక తో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దశ తిరుగుతుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?