సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

Fidaa Stands Next To Ramulamma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా అభిమానించారో అంత సులభంగా వదిలేయరు. మొదటి సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం సాయి పల్లవిని నెత్తిన ఎత్తేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఏ విషయం అయినా కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఆమె గురించి చర్చించుకోవడం, మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి ట్విట్టర్‌లో సాయి పల్లవి రాములమ్మ అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం విజయశాంతి నటించిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రంలోని రాములమ్మ పాత్రకు సాయి పల్లవి పాత్రకు పోలిక ఉందని అతడు అభిప్రాయ పడ్డాడు. 

ట్విట్టర్‌లో అతడు చేసిన పోస్ట్‌కు చాలా మంది సమర్ధిస్తూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాకు ఈ సినిమాకు అస్సలు పోలిక ఎలా పెడతారు అంటూ ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ యాస తప్ప మిగిలినదంతా కూడా పూర్తి విభిన్నం. అది విప్లవ సినిమా, ఇది లవ్‌ స్టోరీ, ఎక్కడైనా పోలిక ఉందా. సాయి పల్లవిని ఎలా రాములమ్మ అంటారో మీకే తెలియాలి అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవిని సౌందర్యతో నిన్న మొన్నటి వరకు పోల్చిన నెటిజన్స్‌ ఇప్పుడు రాములమ్మ అంటున్నారు. ముందు ముందు మరేం అంటారో చూడాలి.

మరిన్ని వార్తలు:

జై రికార్డును స్పైడర్‌ బద్దలు కొట్టేనా?

భక్త ప్రహ్లాద ని తెస్తున్న గుణశేఖర్.