భక్త ప్రహ్లాద ని తెస్తున్న గుణశేఖర్.

gunasekhar next movie bhakta prahlada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రుద్రమదేవి తర్వాత కొన్నాళ్లుగా మౌనంగా వున్న దర్శకనిర్మాత గుణశేఖర్ హఠాత్తుగా ఈరోజు శ్రీవారి సమక్షంలో తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటన చేశారు. గుణ ప్రతాపరుద్ర లేదా హిరణ్యకశ్యప చేయొచ్చని వార్తలు వినిపించినా చివరికి భక్త ప్రహ్లాద చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ చేసాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ముందుగా కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్న గుణశేఖర్ కొత్త సినిమా వివరాలు తెలియజేశాడు. ఈసారి భక్తప్రహ్లాద అనే పౌరాణిక చిత్రం చేయబోతున్నట్టు వివరించాడు. రుద్రమదేవి కన్నా ఈ సినిమా భారీగా ఉంటుందని ఆయన చెప్పారు.
అయితే నటీనటుల వివరాలు మాత్రం గుణ బయటికి వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు:

జై రికార్డును స్పైడర్‌ బద్దలు కొట్టేనా?

‘నేనే రాజు నేనే మంత్రి’ కొత్త తరహా ప్రమోషన్స్‌